తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు అలెర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.