కొత్త పథకాలపై సీఎం కీలక సమీక్ష.. అధికారులకు సీరియస్ వార్నింగ్!
సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.